కొత్త క్రిమినల్ చట్టాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:59 AM
బ్రిటిషు కాలం నాటి చట్టాలకు బదులు రూపొందించిన మూడు ‘సంహిత’లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్
న్యూఢిల్లీ, డిసెంబరు 25: బ్రిటిషు కాలం నాటి చట్టాలకు బదులు రూపొందించిన మూడు ‘సంహిత’లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ బదులు భారతీయ న్యాయ సంహిత, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులు భారతీయ సాక్ష్య అధియాన్‌లను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. గత వారం వీటికి పార్లమెంటు ఆమోదం తెలిపింది.
Updated Date - Dec 26 , 2023 | 06:53 AM