ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Premalatha: ప్రేమలత అంతమాట అనేశారేంటో.. ఆమె వ్యాఖ్యలు వింటే..

ABN, First Publish Date - 2023-06-02T10:41:32+05:30

దేశంలో మహిళా బాక్సర్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని డీఎండీకే కోశాధికారి ప్రేమలత(Premalatha) అభిప్రాయపడ్డారు. ఆమె గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): దేశంలో మహిళా బాక్సర్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని డీఎండీకే కోశాధికారి ప్రేమలత(Premalatha) అభిప్రాయపడ్డారు. ఆమె గురువారం మదురై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలపై కుస్తీ పోటీల్లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి, అనేక పతకాలు గెలుచుకున్న మహిళా రెజర్లకు మన దేశంలోనే రక్షణ లేకుండా పోయిందన్నారు. తమను లైంగికంగా వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేసున్నప్పటికీ వారిని పట్టించుకునే నాథుడే లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) నిర్మించతలపెట్టిన మెకెదాటు ఆనకట్టను రాష్ట్ర ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోరన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Updated Date - 2023-06-02T10:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising