ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Assembly election results : ‘ఇండియా’ దృష్టంతా అసెంబ్లీ ఫలితాలపైనే

ABN, First Publish Date - 2023-12-03T03:16:51+05:30

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఆ ఐదు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, ప్రజలే కాకుండా ఇండియా కూటమిలోని మిగతా రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా ఆతృతగా ..

అనుకూలంగా వస్తాయని కాంగ్రెస్‌ ధీమా

తద్వారా లోక్‌సభ టికెట్లలో పెద్దన్న పాత్ర

అందుకే ఇప్పటిదాకా సర్దుబాటు చర్చల్లేవ్‌

వ్యూహంపై భేటీకి మమత సూచన

మకు అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌ ధీమా

న్యూఢిల్లీ/బెంగళూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఆ ఐదు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, ప్రజలే కాకుండా ఇండియా కూటమిలోని మిగతా రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని, తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తమ మాటకే ఎక్కువ విలువ ఉంటుందని కాంగ్రెస్‌ మొదటి నుంచి భావిస్తోంది. అందుకే ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలను ఆ పార్టీ ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తూ వచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు నెలలో ముంబైలో ఇండియా కూటమి సమావేశం అయినప్పుడే టీఎంసీ, ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీలు సీట్ల కేటాయింపుపై చర్చకు పట్టుబట్టాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, సెప్టెంబరులో హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు... సీట్ల కేటాయింపుపై ఇప్పుడే చర్చలు వద్దని, 5 రాష్ట్రాల్లో కాంగ్రె్‌సకు మంచి ఫలితాలు వస్తాయని, ఆ తర్వాతే సీట్ల చర్చకు వెళ్లాలని సూచించినట్లు తెలిపాయి. ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణలో కాంగ్రె్‌సదే అధికారమని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. మధ్యప్రదేశ్‌లోనూ హోరాహోరీ ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు ఇండియా కూటమిలో కీలక మార్పులకు కారణం కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మహువా వెంటే

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ శనివారం ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలను కలిశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కూటమి సమావేశం జరగాలని, లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలని ఆమె వారికి సూచించినట్లు తెలిసింది. తమ ఎంపీ మహువాను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు కూడా మమత వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై శనివారం ఆమె పలు పార్టీల నేతలతో మాట్లాడారు. మహువాను సస్పెండ్‌ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభలో నివేదిక ప్రవేశపెడితే.. ఇండియా కూటమి సభ్యులు దాన్ని వ్యతిరేకించే అవకాశాలున్నాయన్నారు.

4 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే అధికారం: ఖర్గే

ఐదు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, చత్తీ్‌సగఢ్‌లో పూర్తి మెజారిటీతో తమ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుందన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సకు ఆపరేషన్‌ భయం లేదన్నారు. అధిష్టానం సూచనతో డీకే శివకుమార్‌ హైదరాబాద్‌కు వెళ్లారని చెప్పారు.

Updated Date - 2023-12-03T03:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising