మరో పార్టీలోకి వెళ్లేందుకు పిచ్చోడిని కాదు!
ABN, Publish Date - Dec 14 , 2023 | 05:18 AM
‘నేను పుట్టుకతో కాంగ్రెస్ వాదిని. మరో పార్టీలోకి వెళ్లేందుకు నేనేమీ పిచ్చోడిని కాదు’ అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘నేను పుట్టుకతో కాంగ్రెస్ వాదిని. మరో పార్టీలోకి వెళ్లేందుకు నేనేమీ పిచ్చోడిని కాదు’ అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తేల్చిచెప్పారు. అధికార పార్టీలో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓ ప్రముఖ నేత 50-60 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో వెళ్లేందుకు సిద్ధమయ్యారని ఇటీవల జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఆ ప్రముఖ నేత ఢిల్లీలో బీజేపీ నేతతో చర్చించారని కూడా అన్నారు. దీనిపై డీకే తీవ్రంగా స్పందించారు. జీవితకాలం కాంగ్రెస్ వాదినని, తానెందుకు పార్టీ మారుతానని ప్రశ్నించారు
Updated Date - Dec 14 , 2023 | 05:18 AM