ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Niti Aayog: 27 నుంచి నీతి ఆయోగ్ సమావేశాలు

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:01 PM

న్యూఢిల్లీ: ఈ నెల 27వ తేదీ నుంచి నీతి ఆయోగ్ ఉన్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో నీతి ఆయోగ్ సమావేశాలు నిర్వహించనుంది.

న్యూఢిల్లీ: ఈ నెల 27వ తేదీ నుంచి నీతి ఆయోగ్ ఉన్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో నీతి ఆయోగ్ సమావేశాలు నిర్వహించనుంది. ప్రధానంగా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, అమలు తీరుతెన్నులపై సమావేశాల్లో చర్చించనున్నారు. ఈనెల 27 నుంచి 29 వరకు ఢిల్లీ పూసా ఇనిస్టిట్యూట్‌లో సమావేశాలు జరగనున్నాయి. కాగా ఇది నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో 3వ సారి జరుగుతున్న ప్రధాన కార్యదర్శుల కాన్ఫరెన్స్‌...

అన్ని రాష్ట్రాల సీఎస్‌లు తప్పని సరిగా హాజరు కావాలని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా లేఖలు పంపారు. ఈ కాన్ఫరెన్స్‌కు వచ్చే ముందు... అన్ని రాష్ట్రాలు నీతి ఆయోగ్‌ కోరిన అంశాలపై నివేదికలు పంపాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, అమలు తీరుతెన్నులపై సీఎస్‌లను నీతి ఆయోగ్ నివేదికలు కోరింది. కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే కనీసం వారం రోజుల ముందుగా అయినా నివేదికలు పంపాలని నీతి ఆయోగ్‌ సూచించింది.

Updated Date - Dec 18 , 2023 | 02:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising