ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Blast: సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. 9 మంది మృతి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:47 AM

మహారాష్ట్ర(Maharashtra)లోని ఓ సోలార్ కంపెనీ(Solar Company Blast)లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ బ్లాస్ట్ లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

ముంబయి: మహారాష్ట్ర(Maharashtra)లోని ఓ సోలార్ కంపెనీ(Solar Company Blast)లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ బ్లాస్ట్ లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్ పుర్(Nagpur)లోని బజార్ గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీ ఉంది. ఉదయం షిఫ్టులో భాగంగా కార్మికులు విధుల్లో చేరారు.

ఈ క్రమంలో కాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో రసాయనద్రావణంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో చుట్టు పక్కల పని చేస్తున్న కార్మికులు చెల్లాచెదురయ్యారు. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు నాగ్ పుర్ పోలీసులు తెలిపారు.

"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 17 , 2023 | 11:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising