ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu Kashmir: హిజ్బుల్ చీఫ్ సైయద్ సలావుద్దీన్ తనయుల ఆస్తులను సీజ్‍ చేసిన ఎన్ఐఏ

ABN, First Publish Date - 2023-04-24T18:31:30+05:30

ఉగ్రవాదంపై మరోసారి నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోమవారంనాడు పంజా విసిరింది. అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: ఉగ్రవాదంపై మరోసారి నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోమవారంనాడు పంజా విసిరింది. అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ (Hizbul Mujahideen) చీఫ్ సైయద్ సలావుద్దీన్ (Syed Salahuddin) ఇద్దరు కుమారుల ఆస్తులను సీజ్ చేసింది. సలావుద్దీన్ కుమారుడైన సైయద్ యూసుఫ్, సైయద్ అహ్మద్ షకీల్‌కు చెందిన బుద్గావ్‌లోని రెండు స్థిరాస్తులను సీజ్ చేసింది.

సలావుద్దీన్ కొడుకులు ఇద్దరూ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు. ఒకరు 2017 అక్టోబర్ నుంచి, మరొకరు 2018 ఆగస్టు నుంచి ఈ జైలులో ఉన్నారు. విదేశాల్లో ఉన్న సలావుద్దీన్ అనుచరుల నుంచి, స్థానిక హిజ్బుల్ ముజాహిద్దీన్ కార్యకర్తల నుంచి ఈ ఇద్దరూ నిధులు సేకరించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీరిపై చార్జిషీటు కూడా నమోదైంది. కాగా, సలావుద్దీన్ 1993లో పాకిస్థా్న్ పారిపోగా, నరేంద్ర మోదీ ప్రబుత్వం 2020 అక్టోబర్‌లో ఆయనను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్థాన్ నుంచే సలావుద్దీన్ ఉగ్రకలాపాలు సాగిస్తున్నాడు. సుమారు 13 పాకిస్థాన్ ఉగ్ర సంస్థల సమూహంగా ఏర్పడిన యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ (యూజేసీ)కి కూడా సలావుద్దీన్ చీఫ్‌గా ఉన్నాడు. యూజేసీనే ముత్తహిదా జిహాద్ కౌన్సిల్ (MJC)గా కూడా పిలుస్తారు.

Updated Date - 2023-04-24T18:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising