Raigad: లోయలో పడిన బస్సు...12 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు
ABN, First Publish Date - 2023-04-15T09:15:20+05:30
మహారాష్ట్రలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
Bus Accident
రాయగడ్(మహారాష్ట్ర): మహారాష్ట్రలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రాయగఢ్ జిల్లాలోని ఖోపోలి వద్ద శనివారం బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడింది.(Mumbai-bound bus) ఈ దుర్ఘటనలో 12 మంది మరణించగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.రాయగడ్ జిల్లాలో(Raigad) బస్సు లోయలో(Bus Accident) పడినపుడు అందులో 40 నుంచి 45 మంది ప్రయాణికులున్నారని, అందులో 25 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని గాయగడ్ ఎస్పీ చెప్పారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం దెబ్బతింది. గోరేగాం నుంచి పూణే వెళుతుండగా బస్సు ప్రమాదం జరిగింది.
Updated Date - 2023-04-15T09:15:20+05:30 IST