MP Kalanidhi: చెన్నై విమానాశ్రయంలో టోల్‌గేట్ తొలగించాలి
ABN, First Publish Date - 2023-02-21T11:54:13+05:30
విమాన ప్రయాణికులకు ఇబ్బందికరంగా చెన్నై విమానాశ్రయ ప్రాంతంలో ఏర్పాటుచేసిన టోల్‌గేట్(Tollgate) తొలగించాలని కోరుతూ
- ఎంపీ కళానిధి వీరాస్వామి
ప్యారీస్(చెన్నై): విమాన ప్రయాణికులకు ఇబ్బందికరంగా చెన్నై విమానాశ్రయ ప్రాంతంలో ఏర్పాటుచేసిన టోల్‌గేట్(Tollgate) తొలగించాలని కోరుతూ ఉత్తర చెన్నై డీఎంకే ఎంపీ డాక్టర్ కళానిధి వీరాస్వామి(MP Dr. Kalanidhi Veeraswamy) కేంద్రమంత్రికి లేఖ రాశారు. ఈ విమానాశ్రయ ప్రయాణికుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు రూ.250 కోట్లు వెచ్చించి 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తులతో నిర్మించిన పార్కింగ్‌ను గత ఏడాది డిసెంబరు 4వ తేది ప్రారంభించారు. ఇక్కడ 2,150 కార్లు, 400 బైక్‌లు పార్కింగ్ చేసుకొనేందుకు వసతి కల్పించారు. జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు వెళ్లే వాహనాల ప్రయాణికులను పార్కింగ్ ఫీజు చెల్లించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఇందువల్ల టోల్‌గేట్ ముందు ఒక్కొక్కరూ కనీసం 10 నిమిషాలు వేచి ఉండాల్సి ఉందని, ఇందువల్ల ఏర్పడే వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు, ప్రయాణికులు సులువుగా వెళ్లేలా టోల్‌గేట్ తొలగించాలని ఎంపీ కళానిధి వీరాస్వామి తన లేఖలో కోరారు.
Updated Date - 2023-02-21T11:54:15+05:30 IST