ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Minor Girl Murder: ఢిల్లీలో బాలిక దారుణ హత్య.. చూడలేనంత దారుణంగా వీడియో...

ABN, First Publish Date - 2023-05-29T16:43:55+05:30

ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. 16 ఏళ్ల మైనర్ బాలిక ను ఆమె స్నేహితుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. బాలికపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఛిద్రమైన శరీరంతో రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ(Delhi)లోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో (Shahbad Dairy) అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. 16 ఏళ్ల మైనర్ బాలికను (A 16year old girl) ఆమె స్నేహితుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాలికను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 20 సార్లు కత్తిపోట్లు పొడిచిన ఆ ఉన్మాది అంతటితో ఆగకుండా పెద్ద బండరాయితో తలపై పలుమార్లు మోదాడు.

ఛిద్రమైన శరీరంతో రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అతి భయంకరమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను కలవరపెట్టేంత దారుణంగా ఉంది. కాాగా హత్య జరుగుతున్న సమయంలో పలువురు స్థానికులు అక్కడే ఉన్నారు. అయితే నిందితుడిని అడ్డుకునేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. ఓ యువకుడు హంతకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

కాగా హత్యకు గురయిన బాలిక పేరు సాక్షి (16). సాహిల్ అనే స్నేహితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నరరూప రాక్షుసుడిలా కత్తితో కనికరం లేకుండా 20 సార్లు పొడిచాడు. ఢిల్లీలోని షహాబాద్‌లోని జేజే కాలనీలో సాక్షి తన ఇంటి బయట కత్తిపోట్లకు గురైంది. ఈ దారుణ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అయితే ఇంత కిరాతక హత్యకు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషాద ఘటనను అడ్డుకోలేక ఆ ప్రాంతంలోని ప్రత్యక్ష సాక్షులు, నివాసితులు నివ్వెరపోయారు. సాహిల్ దుర్మార్గపు చబాటసారులు నిస్సహాయంగా చూశారు తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఓ యువకుడు సాహిల్ చేయి పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అతనిని ఆపడానికి ధైర్యం చేయలేకపోయాడు. అత్యంత దారుణమైన ఈ ఘటనపై ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చీఫ్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2023-05-29T18:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising