Minister: రాష్ట్రంలో వేగంగా పురావస్తు పరిశోధనలు
ABN, First Publish Date - 2023-09-22T10:34:26+05:30
దేశంలో మరే రాష్ట్రం లో లేని విధంగా తమిళనాడులో పురావస్తు పరిశోధనలు అధికస్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు(
ప్యారీస్(చెన్నై): దేశంలో మరే రాష్ట్రం లో లేని విధంగా తమిళనాడులో పురావస్తు పరిశోధనలు అధికస్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు(Minister Thangam Tennarasu) పేర్కొన్నారు. తంజావూరు తమిళ విశ్వవిద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కలైంజర్ శత వార్షిక రాష్ట్రస్థాయి సదస్సును మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) మంజూరు చేసిన నిధుల సహకారంతో రాష్ట్రంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు ఊపందుకున్నాయన్నారు. కీళడి, పెరునై, వెంబకోట తదితర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వల్ల రాష్ట్ర చరిత్ర ఏ మేరకు వెనకబడి పోయిందో తెలుసుకో గలిగామన్నారు. అందువల్లే తవ్వకాల్లో బయల్పడే పురాతన కళాఖండాలు భద్రపరచి భావితరాలకు వాటి చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తంజావూరు ప్రాంతాన్ని పరిపాలించిన చోళ రాజుల ఘనత తెలియజేసేలా భారీస్థాయిలో ఓ ప్రదర్శనశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక చేసి పనులు కూడా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ సదస్సులో పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్, ఎమ్మెల్యే చంద్రశేఖర్, మేయర్ రామనాథన్, జిల్లా కలెక్టర్ దీపక్‌జాకబ్, తమిళ వర్శిటీ వైస్ ఛాన్సలర్ తిరువళ్లువన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T10:34:26+05:30 IST