ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: రెవెన్యూ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-03-02T12:34:20+05:30

రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ ఎన్నటికీ తలెత్తుకోలేని విధంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు చివరి మేకు కొట్టేయడం ఖాయ మని రెవెన్యూ శాఖా మంత్రి అర్‌ అశోక్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ ఎన్నటికీ తలెత్తుకోలేని విధంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు చివరి మేకు కొట్టేయడం ఖాయ మని రెవెన్యూ శాఖా మంత్రి ఆర్‌ అశోక్‌ పేర్కొన్నారు. బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లా డారు. ఈ నెల 3న కెంపెగౌడ నిర్మించిన చెన్నకేశవ ఆలయంలో పూజల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విజయసంకల్ప యాత్రకు సంబంధించిన నాల్గో రథాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అనంతరం దేవనహళ్ళి పాఠశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగిస్తారన్నారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టేలా గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకున్నామని మంత్రి తెలిపారు. తన నాయకత్వంలోని టీమ్‌ 3న ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. తమ జట్టులో మంత్రులు డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ, కే గోపాలయ్య, ఎస్‌టీ సోమశేఖర్‌, డాక్టర్‌ సుధాకర్‌, లోక్‌సభ సభ్యుడు పిసి.మోహన్‌ తదితరులు ఉంటారన్నారు. తమ జట్టు మొత్తం 17 బహిరంగ సభలను నిర్వహిస్తుందని 7 మోర్చాల సభలను కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బెంగళూరు, రామనగర, కోలార్‌, చిక్కబళ్ళాపుర, తుమకూరు, చిత్రదుర్గ ప్రాంతాలల్లో తమ రథయాత్ర సాగుతుందని ఆయన వివరించారు.

గత మూడు నెలలుగా విడుదలైన సమీక్షలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తమ పార్టీ స్పష్టమైన మెజార్టీ కంటే అధిక స్ధానాలను కైవసం చేసుకోవడం ఖాయమని ఈ సారి పాతమైసూరు జిల్లాల్లోనూ సంచలన విజయాలను నమోదుచేస్తామని మంత్రి అశోక్‌ పేర్కొన్నారు. మాజీ సీఎం యడియూరప్ప, మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి(Gali Janardhana Reddy) జైలు పాలు కావడానికి కాంగ్రెస్‌ కుట్రే కారణమని ఆయన ఆరోపించారు. బీజేపీకి బలమైన నాయకత్వ శ్రేణి ఉందని కాంగ్రెస్‌లో గ్రూపుల లీడర్లకు కొదవలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలు అర్థం పర్థం లేనివన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. బీజేపీ ముఖ్యకార్యదర్శి జగదీష్‌ హీరేమని, బెంగళూరు ఉత్తర జిల్లా ధ్యక్షుడు బీ నారాయణగౌడ తదితరులు మీడి యా సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T12:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!