ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: మంత్రి సంచలన కామెంట్స్.. ఎలాగైనా దాన్ని అడ్డుకుంటాం..

ABN, First Publish Date - 2023-06-01T08:25:42+05:30

కావేరి నదిపై మెకెదాటు వద్ద ఆనకట్టను నిర్మిస్తామన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): కావేరి నదిపై మెకెదాటు వద్ద ఆనకట్టను నిర్మిస్తామన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Sivakumar) చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌(Duraimurugan) తీవ్రంగా ఖండించారు. ఇదే విషయంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... కర్ణాటక రాష్ట్ర మంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై దృష్టి సారించి, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటారని భావించామన్నారు. కానీ, ఆయన అందుకు విరుద్ధంగా కావేరి నదిపై ఆనకట్ట నిర్మిస్తామని ప్రకటించడాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఒకవేళ ఈ ఆనకట్ట విషయంలో కర్ణాటక ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే అడ్డుకుని తీరుతామని మంత్రి తెగేసి చెప్పారు. అదేవిధంగా డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌(Vijayakanth) కూడా కర్ణాటక మంత్రి శివకుమార్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారికంలోకి వస్తున్నాయన్నారు. ఆ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినపుడల్లా ఈ మెకెదాటు ఆనకట్ట వ్యవహారం తెరపైకి వస్తుందన్నారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పలు ఆనకట్టలను నిర్మించిందన్నారు. ఇపుడు మెకెదాటు వద్ద మరో ఆనకట్టను నిర్మిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఆనకట్ట నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వరాదని ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరారు. కాగా, పొరుగు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఈ ఆనకట్టను నిర్మిస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్‌ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.

Updated Date - 2023-06-01T08:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising