Metro trains: ఫిబ్రవరిలో మెట్రోరైళ్లలో ఎంతమంది ప్రయాణించారో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-03-02T10:40:59+05:30
మెట్రోరైళ్ల(Metro trains)లో ఫిబ్రవరిలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్(Chennai Metrorail Limited) తెలిపింది. జనవరిలో మెట్రో
పెరంబూర్(చెన్నై): మెట్రోరైళ్ల(Metro trains)లో ఫిబ్రవరిలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్(Chennai Metrorail Limited) తెలిపింది. జనవరిలో మెట్రో రైళ్లలో 66 లక్షల మంది ప్రయాణించారు. ఫిబ్రవరిలో 28 రోజులే కావడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 28వ తేది 63,66,282 మంది, 10వ తేది అత్యధికంగా 2,61,668 మంది ప్రయాణించి నట్లు తెలిపింది. క్యూ ఆర్ కోడ్ టిక్కెట్ల ద్వారా 20,20,027 మంది, ట్రావెల్ కార్డు ద్వారా 39,85,113 మంది ప్రయాణించినట్లు సీఎంఆర్‌ఎల్ తెలిపింది.
Updated Date - 2023-03-02T10:40:59+05:30 IST