Metro rail tracks: మెట్రో రైలు పట్టాలకు పగుళ్లు
ABN, First Publish Date - 2023-02-08T11:08:37+05:30
నగర ప్రజా రవాణాలో ఒకటైన నమ్మ మెట్రోకు ఎంతో ఆదరణ ఉంది. మెజస్టిక్ నుంచి కెంగేరి వెళ్లే మార్గంలో మైసూరు రోడ్డు(Mysore Road)లో
- అప్రమత్తమైన బీఎంఆర్‌సీఎల్
బెంగళూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజా రవాణాలో ఒకటైన నమ్మ మెట్రోకు ఎంతో ఆదరణ ఉంది. మెజస్టిక్ నుంచి కెంగేరి వెళ్లే మార్గంలో మైసూరు రోడ్డు(Mysore Road)లో పట్టాల మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి. పట్టణగెరె మెట్రో స్టేషన్‌కు కూతవేటు దూరంలో పగుళ్లు ఏర్పడ్డాయి. మెట్రోరైలు సంచారంలోనూ, వేగంలోనూ శబ్ధంలో మార్పు రావడాన్ని పైలట్, ఇతర సిబ్బంది సోమవారం గుర్తించారు. వెంటనే బీఎంఆర్‌సీఎల్ అధికారులకు సమాచారం అందించారు. తక్షణం పగుళ్ల సమస్యను సరిచేశారు. కాగా మూడేళ్లలోనే పగుళ్లు రావడంపై నాణ్యతలో లోపం ఉందా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల నిర్మాణదశలోనే నాగవార సమీపాన మెట్రో పిల్లర్ కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన సంగతి విదితమే. దీనిపై బీఎంఆర్‌సీఎల్ అధికారులు స్పందిస్తూ ఎప్పటికప్పుడు సాంకేతిక సిబ్బంది అన్ని మార్గాలను పర్యవేక్షిస్తున్నారని వివరణ ఇచ్చారు. మొత్తానికి సకాలంలోనే సమస్యను పరిష్కరించడంతో పెద్ద గండం తప్పినట్టు అయిందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు.
ఇవికూడా చదవండి: రింగ్‌రోడ్డుకు పునీత్ పేరు
Updated Date - 2023-02-08T11:08:39+05:30 IST