Puneeth Rajkumar: రింగ్‌రోడ్డుకు పునీత్‌ పేరు

ABN , First Publish Date - 2023-02-08T10:55:19+05:30 IST

పద్మనాభనగర్‌ నియోజకవర్గంలోని సుమారు 12 కిలోమీటర్ల మేర ఉండే రింగ్‌రోడ్డుకు కర్ణాటక రత్న పునీత్‌రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) రోడ్డుగా

Puneeth Rajkumar: రింగ్‌రోడ్డుకు పునీత్‌ పేరు

బెంగళూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పద్మనాభనగర్‌ నియోజకవర్గంలోని సుమారు 12 కిలోమీటర్ల మేర ఉండే రింగ్‌రోడ్డుకు కర్ణాటక రత్న పునీత్‌రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) రోడ్డుగా నామకరణం చేశారు. మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై లాంఛనంగా ప్రారంభించి అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌, ఎంపీ తేజస్వి సూర్య, ఎమ్మెల్యేలు సతీశ్‌రెడ్డి, రవిసుబ్రమణ్య, ఉదయ్‌ గరుడాచార్‌, ఎం కృష్ణప్ప, నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, అభిషేక్‌ అంబరీశ్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-08T10:55:21+05:30 IST