నేడు మధ్యప్రదేశ్ సీఎం ఎన్నిక
ABN, First Publish Date - 2023-12-11T03:31:15+05:30
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక సోమవారం జరుగనుంది. గత వారం అసెంబ్లీకి ఎన్నికైన 163 మంది ఎమ్మెల్యేలు ఽశాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు భోపాల్లో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు.
భోపాల్‌లో సమావేశం కానున్న బీజేపీ ఎమ్మెల్యేలు
భోపాల్-న్యూఢిల్లీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక సోమవారం జరుగనుంది. గత వారం అసెంబ్లీకి ఎన్నికైన 163 మంది ఎమ్మెల్యేలు ఽశాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు భోపాల్లో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు. పార్టీ కేంద్ర పరిశీలకులు హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా నేత కె.లక్ష్మణ్, కార్యదర్శి ఆశా లక్రాల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు సీఎం ఎవరో ప్రకటిస్తారని అంటున్నారు. రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చౌహాన్‌తో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, నరేంద్రసింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా, సీనియర్ నేత కైలాస్ విజయవర్గియ, రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు ఇప్పటికే అమిత్‌షాను కలిసి చర్చలు జరిపారు. చౌహాన్ సీఎంగా కొనసాగుతారో లేదో చెప్పలేమని, పార్టీ ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని లక్ష్మణ్ ఢిల్లీలో చెప్పారు.
Updated Date - 2023-12-11T07:18:57+05:30 IST