ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమార్తె వీడియో కలకలం
ABN, First Publish Date - 2023-11-29T05:10:25+05:30
శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాడుతూ, ఆ దేశ సైన్యం చేతిలో హతమైన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ జన్మదినం సందర్భంగా ఆయన je
చెన్నై, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాడుతూ, ఆ దేశ సైన్యం చేతిలో హతమైన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ జన్మదినం సందర్భంగా ఆయన కుమార్తె ద్వారక పేరుతో సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియో కలకలం సృష్టిస్తోంది. ఆ వీడియోలో తమిళ ఈలం పోరు పరిసమాప్తం కాలేదని, మరింత దృఢంగా ముందడుగు వేస్తూ.. ప్రభాకరన్ లక్ష్యాన్ని సాధించి తీరుతామని ద్వారక శపథం చేసింది. ఈ వీడియో ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతోంది. ఆ వీడియోలో ఉన్నది ద్వారకే అని తమిళ విమోచన ఉద్యమనేత పి. నెడుమారన్ ప్రకటించారు. 14 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న ద్వారక మళ్లీ తెరపైకి రావటం ఆనందంగా ఉందని, ఇదే రీతిలో ప్రభాకరన్ కూడా త్వరలో ప్రజల ముందుకు వస్తాడని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-11-29T06:57:11+05:30 IST