ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kavery waters: కావేరిని విడుదల చేయిస్తారా? లేదా?

ABN, First Publish Date - 2023-09-20T08:19:31+05:30

రాష్ట్రానికి రావాల్సిన కావేరి జలాలను కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) విడుదల చేసేలా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ డెల్టా

- డెల్టా రైతుల నిరసన

- పలుచోట్ల రైల్‌ రోకో

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రానికి రావాల్సిన కావేరి జలాలను కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) విడుదల చేసేలా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ డెల్టా రైతులు నిరసనకు దిగారు. మంగళవారం తంజావూరు, తిరువారూర్‌, సీర్గాళి, నాగపట్టణం ప్రాంతాల్లో తమిళనాడు కావేరి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో రైల్‌ రోకోలు చేపట్టారు. దీంతో పలు చోట్ల రైళ్లు నిలిచిపోయాయి. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టడంతో రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి. రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల కురువై పంటలు, సాంబా సీజన్‌లో 15 లక్షల ఎకరాల్లో సాగుచేసేలా కావేరి నిర్వహణ మండలి ఉత్తర్వుల ప్రకారం కర్ణాటక నీటిని విడుదల చేయాలని, మెకెదాటు డ్యాం(Mekedatu Dam) నిర్మాణాన్ని కర్ణాటక ప్రభుత్వం విరమించుకోవాలని, కావేరి నిర్వహణ మండలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదనే డిమాండ్లతో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఆర్‌ పాండ్యన్‌ పిలుపునిచ్చారు. తంజావూరులో ఆ సంఘ అధ్యక్షుడు పళనియప్పన్‌ అధ్యక్షతన జరిగిన జరిగిన రైల్‌ రోకోలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొని కర్ణాటక, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - 2023-09-20T08:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising