ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: కర్ణాటక అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా ఖదెర్

ABN, First Publish Date - 2023-05-24T14:42:07+05:30

కర్ణాటక శాసనసభ కొత్త స్పీకర్‌గా మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూటీ ఖదెర్ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో స్పీకర్‌గా ఒక ముస్లిం నేత ఎన్నిక కావడం ఇదే ప్రథమం. 53 ఏళ్ల ఖదిర్ పేరును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్ధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక శాసనసభ కొత్త స్పీకర్‌గా (Assembly Speaker) మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూటీ ఖదెర్ (UT Khader) బుధవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో స్పీకర్‌గా ఒక ముస్లిం నేత ఎన్నిక కావడం ఇదే ప్రథమం. 53 ఏళ్ల ఖదిర్ పేరును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్ధించారు. స్పీకర్ పదవికి ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో సభ ఏకగ్రీవంగా ఖదెర్‌ను ఎన్నుకున్నట్టు ప్రొటెం స్పీకర్ ఆర్‌వీ దేశ్‌పాండే ప్రకటించారు. ఖదెర్ గత అసెంబ్లీలో కాంగ్రెస్ విపక్ష నేతగా కూడా వ్యవహరించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రొటెం స్పీకర్‌గా దేశ్‌పాండేను ఎన్నుకున్నారు. 22వ తేదీ నుంచి మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. తొలిరోజు సమావేశాల్లో సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివరకుమార్‌లు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సమావేశాల్లోనే స్పీకర్ ఎన్నిక జరుపుతామని ప్రకటించిన సిద్ధరామయ్య, అందుకు తగినట్టుగానే ఖదిర్ పేరును స్పీకర్‌గా ప్రకటించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - 2023-05-24T14:42:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising