109కి పెరిగిన జేఎన్.1 కేసులు
ABN, Publish Date - Dec 28 , 2023 | 03:20 AM
దేశంలో కరోనా సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు మరో 40 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 109కి పెరిగింది. రాష్ట్రాల వారీగా
న్యూఢిల్లీ, డిసెంబరు 27: దేశంలో కరోనా సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు మరో 40 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 109కి పెరిగింది. రాష్ట్రాల వారీగా గుజరాత్‌లో 36, కర్ణాటక 34, గోవా 14, మహారాష్ట్ర 9, కేరళ 6, రాజస్థాన్, తమిళనాడులో 4 చొప్పున, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. జేఎన్.1 వేరియంట్ సోకిన రోగుల్లో అత్యధికులు ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండి కోలుకుంటున్నారని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రావట్లేద ని అధికార వర్గాలు తెలిపాయి. కాబట్టి ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నా ఆందోళన అవసరం లేదని పేర్కొన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా మరో 529 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం క్రియాశీల కేసులు 4,093కు పెరిగాయని పేర్కొంది.
Updated Date - Dec 28 , 2023 | 03:20 AM