IT raids: తమిళనాడులో డీఎంకే మంత్రి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు
ABN, First Publish Date - 2023-05-26T09:48:35+05:30
తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు...
DMK minister Senthil Balaji
చెన్నై(తమిళనాడు): తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. మంత్రికి చెందిన 40 ప్రాంతాల్లో శుక్రవారం ఏకకాలంలో ఐటీ అధికారులు దాడి చేసి సోదాలు చేస్తున్నారు.(IT raids) కరూర్ ప్రాంతానికి చెందిన బాలాజీ సీనియర్ డీఎంకే నాయకుడు.(DMK minister Senthil Balaji) చెన్నై, కరూర్ ప్రాంతాల్లోని మంత్రి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు.
Updated Date - 2023-05-26T09:48:35+05:30 IST