ఐఫోన్ యూజర్లు జాగ్రత్త!
ABN, Publish Date - Dec 17 , 2023 | 05:42 AM
ఐఫోన్ వంటి ఆపిల్ ఉత్పత్తులకు అటాకర్ల నుంచి ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. డాటాను, ఇతర కీలక సమాచారాన్ని అపహరించే ప్రమాదం ఉందంటూ
సైబర్ అటాకర్లు దాడి చేయొచ్చు: కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 16: ఐఫోన్ వంటి ఆపిల్ ఉత్పత్తులకు అటాకర్ల నుంచి ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. డాటాను, ఇతర కీలక సమాచారాన్ని అపహరించే ప్రమాదం ఉందంటూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ-ఇన్) హెచ్చరిక జారీ చేసింది. ఐఫోన్‌తో పాటు ఐఓఎస్ ఐపాడ్‌ఓఎస్, టీవీఓఎస్, వాచ్‌ఓఎ్‌స, సఫారీ బ్రౌజర్లకు ఈ హెచ్చరిక వర్తిసుంది. అటాకర్లు కీలక సమాచారాన్ని, ఎగ్జిక్యూటివ్ ఆర్బిట్రరీ కోడ్‌లను సంపాదించుకోవడంతో పాటు, ఇతర కమాండ్లను పక్కదోవ పట్టించే ప్రమాదం ఉందని తెలిపింది. సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ల విషయంలోనూ ఇలాంటి ముప్పే ఉందని ఈ వారంలోనే హెచ్చరించడం గమనార్హం.
Updated Date - Dec 17 , 2023 | 06:40 AM