వసుంధర వర్గంలో అసహనం
ABN, First Publish Date - 2023-12-11T03:32:33+05:30
ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులైనా సీఎం పదవిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎటూ తేల్చకపోవడంపై మాజీ సీఎం వసుంధరరాజే వర్గం అసహనం, అసంతృప్తితో రగిలిపోతోంది.
జైపూర్-బెంగళూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులైనా సీఎం పదవిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎటూ తేల్చకపోవడంపై మాజీ సీఎం వసుంధరరాజే వర్గం అసహనం, అసంతృప్తితో రగిలిపోతోంది. తమ నాయకురాలితోపాటు ఎంపీలు బాబా బాలక్‌నాథ్, రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్, దియాకుమారి (వీరంతా ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు) పేర్లనూ తెరపైకి తెస్తుండడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఆదివారం పది మంది ఎమ్మెల్యేలు ఆమెతో భేటీ అయ్యారు. గత సోమ, మంగళవారాల్లో ఏకంగా 25 మంది సమావేశమయ్యారు.
Updated Date - 2023-12-11T07:13:17+05:30 IST