ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IndiGo: పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి.. ఉదయ్‌పూర్‌లో ల్యాండైన ప్రయాణికుడు!

ABN, First Publish Date - 2023-02-03T21:25:07+05:30

పాట్నా(Patna) వెళ్లేందుకు ఇండిగో విమానం(Indigo Flight) ఎక్కిన ఓ ప్రయాణికుడు ఉదయ్‌‌పూర్‌(Udaipur)లో దిగాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పాట్నా(Patna) వెళ్లేందుకు ఇండిగో విమానం(Indigo Flight) ఎక్కిన ఓ ప్రయాణికుడు ఉదయ్‌‌పూర్‌(Udaipur)లో దిగాడు. ఈ విచిత్ర ఘటన జనవరి 30న జరిగింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లేందుకు అఫ్సర్ హుస్సేన్ ఇండిగో విమానం 6E-214 టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే, అతడు పాట్నా వెళ్లాల్సిన విమానానికి బదులుగా ఉదయ్‌పూర్ విమానం ఎక్కేశాడు.

అయితే, బోల్డన్ని చెకింగ్‌ల తర్వాత కానీ ప్రయాణికులను విమానంలోకి అనుమతించరు. అలాంటిది ఒక విమానానికి బదులుగా మరో విమానంలో ప్రయాణికుడు ఎక్కినప్పుడు గమనించకుండా ఎలా ఉంటారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఫైర్ అయింది. దీనిపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఇండిగోను ఆదేశించింది. ప్రయాణికులను విమానం దగ్గరకు తీసుకెళ్లే షటిల్ బస్సుల్లో ఒకదానికి బదలుగా మరో దాంట్లో హుస్సేన్ ఎక్కడం వల్లే ఈ పొరపాటు జరిగినట్టు తెలుస్తోంది.

ఈ విషయంలో నివేదిక కోరిన డీజీసీఏ ఇండిగోపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఫైనల్ బోర్డింగ్‌కు ముందు రెండు పాయింట్ల వద్ద బోర్డింగ్ పాస్‌ను చెక్ చేయాల్సి ఉండగా నిబంధన ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. కాగా, పాట్నాకు బదులుగా ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో దిగి అవాక్కయిన హుస్సేన్ విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో కంగుతిన్న ఇండిగో అధికారులు అదే విమానంలో ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడి నుంచి తర్వాతి రోజున అంటే జనవరి 31న పాట్నా చేర్చింది.

Updated Date - 2023-02-03T21:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising