ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గాజాపై కాల్పుల విరమణకు భారత్‌ మద్దతు

ABN, Publish Date - Dec 14 , 2023 | 05:20 AM

ఇజ్రాయెల్‌-హమాస్‌ వివాదంలో తక్షణం మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ పాటించాలని, బేషరతుగా బందీలను విడుదల చేయాలని కోరుతూ యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా భారత్‌ ఓటు వేసింది. 193 సభ్య

ఐక్యరాజ్యసమితి, డిసెంబరు 13: ఇజ్రాయెల్‌-హమాస్‌ వివాదంలో తక్షణం మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ పాటించాలని, బేషరతుగా బందీలను విడుదల చేయాలని కోరుతూ యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా భారత్‌ ఓటు వేసింది. 193 సభ్య దేశాలున్న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో 153దేశాలు తీర్మానానికి మద్దతుగా 10దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా, 23దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ముసాయిదా తీర్మానాన్ని ఈజిప్టు ప్రవేశపెట్టింది. ‘అంతర్జాతీయ మానవతా చట్టం సహా అంతర్జాతీయ చట్టాన్ని అందరూ పాటించాలి. ముఖ్యంగా పౌరుల రక్షణకు కట్టుబడి ఉండాలి’అని తీర్మానంలో పేర్కొంది. తీర్మానం ప్రతిలో ‘హమాస్‌’ పేరు ను ప్రస్తావించలేదు. ఇజ్రాయెల్‌, అమెరికా, ఆస్ట్రియా వ్యతిరేకంగా ఓటు వేయగా జర్మనీ, హంగేరి, ఇటలీ, ఉక్రెయిన్‌, ఇంగ్లండ్‌ ఓటింగ్‌లో పాల్గొనలేదు. కాగా, ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పోరు అంశంలో అమెరికా వైఖరి మారుతోంది. ఇజ్రాయెల్‌ ప్రపంచ మద్దతును కోల్పోతోందని ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్‌ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, ఆయన ప్రభుత్వ తీరు మారాలన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 06:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising