Canada: హర్దీప్ సింగ్ హత్య వెనక భారత్ లేదు... స్పష్టం చేసిన భారత మాజీ దౌత్యవేత్త
ABN, First Publish Date - 2023-12-01T08:50:37+05:30
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(Justine Trudo) ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యకు సంబంధించిన దర్యాప్తులో భారత్ సహకారం కావాలని కోరిన నేపథ్యంలో, మాజీ దౌత్యవేత్త TP శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరువనంతపురం:కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(Justine Trudo) ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యకు సంబంధించిన దర్యాప్తులో భారత్ సహకారం కావాలని కోరిన నేపథ్యంలో, మాజీ దౌత్యవేత్త TP శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ హర్దీప్ ని హత్య చేయించలేదని స్పష్టం చేశారు. దీంతో కెనడా(Canada) వినతిని ఆయన తిరస్కరించారు. అటువంటి కార్యకలాపాలలో పాల్గొనబోనని వెల్లడించారు.
"ఇది సంక్లిష్టమైన సమస్య. భారత్ ప్రమేయం లేదని కచ్చితంగా తెలుసు. ఇలాంటి పనులు భారత్(India) ఎన్నడూ చేయదు. రుజువు, సాక్ష్యం లేనప్పుడు కెనడా ఎలా ఆరోపిస్తుంది. అమెరికా సైతం కెనడా కు మద్దతు ఇస్తోంది. కానీ అది సరికాదు. కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఆధారాలు చూపించండి. లేదా మేం చర్యలు తీసుకుంటాం." అని శ్రీనివాసన్ కామెంట్ చేశారు.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన దర్యాప్తులో సహకరించాలని భారత్ ని ఇటీవల కోరారు. కెనడాలోని సర్రేలోని గురుద్వారా వెలుపల నిజ్జర్ ను జూన్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. భారత్ ఈ హత్య చేయించిందని కెనడా ఆరోపిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో ఇరు దేశాలు తమ దౌత్యవేత్తలను వెనక్కి రప్పించుకున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్యపర సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ కెనడా తీరును ఖండించారు.
Updated Date - 2023-12-01T08:51:53+05:30 IST