ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanatana Dharma: సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే 'ఇండియా' కూటమి ఉద్దేశం: మోదీ

ABN, First Publish Date - 2023-09-14T15:33:27+05:30

సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని బినాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ గురువారం శంకుస్థాపన చేశారు.

భోపాల్: సనాతన ధర్మం (Sanatana Dharma) చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా (INDIA) కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలిక్ స్ఫూర్తిగా నిలిచిన సనాతన ధర్మాన్ని పూర్తిగా చెరిపేయాలని వీరు కోరుకుంటున్నారని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు సతాన ధర్మాన్ని బహిరంగంగా విమర్శించడంతో ఈ దాడులు ప్రారంభించారని, రేపు మనపై ఈ దాడులను ముమ్మరం చేస్తారని అన్నారు. దేశంలోని సనాతనధర్మ అనుయాయులు, దేశాన్ని ప్రేమించేవారంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ప్రజలను అడ్డుకోవాలని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని బినాలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా, రాష్ట్రంలో పది కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి గురువారంనాడు శంకుస్థాపన చేశారు. రూ.50,700 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా బినాలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


నాయకుడే లేడు...

విపక్ష కూటమికి (I.N.D.I.A.) నాయకుడు లేడని, నాయకత్వంపై గందరగోళం ఉందని ప్రధాని విమర్శించారు. ''ముంబైలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక పాలసీ రూపొందించారు. భారతీయ సంస్కృతిపై దాడి...భారతీయుల విశ్వాసాలపై దాడి చేయడమే ఇండీ ఎలయెన్స్‌ విధానం'' అని మోదీ అన్నారు.


సాహసవంతుల గడ్డ బుందేల్‌ఖండ్

ఎందరో వీరులు పుట్టిన గడ్డ బుందేల్‌ఖండ్ అని, బినా, బెట్వా ప్రజలను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని మరింత ప్రోత్సహించేలా రూ.50,000 కోట్లతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని, ఈ ప్రాజెక్టులను ప్రారంభించి, ప్రజలను కలుసుకునే అవకాశం కల్పించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. కొన్ని రాష్ట్రాల బడ్జెట్ రూ.50,000 కోట్లు కూడా లేదని, మధ్యప్రదేశ్‌లో అంతకంటే ఎక్కువ మొత్తాన్నే అభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చి్స్తున్నామని చెప్పారు.


జి-20 విజయం ప్రజావిజయం

జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం అంతా చూసారని, నిజానికి ఈ విజయం దేశ ప్రజల విజయమని మోదీ అభివర్ణించారు. ఇది 140 కోట్ల మంది ప్రజానీకం విజయమన్నారు. దేశ సమష్టి శక్తికి ఇది నిదర్శనమని చెప్పారు. దేశంలోని భిన్నత్వం, వారసత్వ సంపద జి-20 ప్రతినిధుల మనసులను దోచుకుందని అన్నారు.


దేశ అబివృద్ధి కానీ, రాష్ట్రాల అభివృద్ధి పూర్తి పారదర్శకత్వంగా, అవినీతి రహితంగా ఉండాలని ప్రధాని అన్నారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ను గుర్తించిన రోజుల్లో రాష్ట్రాన్ని చిరకాలం పాలించిన నేతలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అవినీతి, నేరాలకు నిలయంగా రాష్ట్రం ఉండేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయలకు దూరంగా రాష్ట్రం ఉండేదన్న విషయం అప్పటి జనరేషన్ ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రోడ్లు, ఇంటింటా విద్యుత్ వెలుగులు వచ్చాయని చెప్పారు.


కాగా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ, జి-20 సదస్సుకు భారతదేశం అధ్యక్షత వహించి చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుందన్నారు. జి-20కి విజయవంతంగా అధ్యక్షత వహించిన మోదీ ఈరోజు ఇక్కడకు వచ్చారని, ఇది గర్వకారణమని అన్నారు. దేశం కోసమే కాకుండా ప్రపంచ సంక్షేమం కోసం ఎవరైనా పనిచేస్తున్నారంటే అది మోదీయేనని ప్రశంసించారు.

Updated Date - 2023-09-14T15:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising