‘చిల్లర ప్రశ్నల’ రికార్డులు నా వద్ద ఉన్నాయి!
ABN, First Publish Date - 2023-11-06T04:44:51+05:30
‘ప్రశ్నలకు డబ్బులు’ ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ తనను అడిగిన చిల్లర, అసంబద్ధ ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు.
బీజేపీని ఉద్దేశిస్తూ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్
న్యూఢిల్లీ, నవంబరు 5: ‘ప్రశ్నలకు డబ్బులు’ ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ తనను అడిగిన చిల్లర, అసంబద్ధ ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. బీజేపీని ఉద్దేశించి ఆమె ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మహిళా ఎంపీలపై తప్పుడు ప్రచారం చేసే ముందు బీజేపీ ఒకటి గుర్తుంచుకోవాలి. చైర్మన్ అడిగిన అనైతిక, చిల్లర ప్రశ్నలు, నాతోపాటు ప్రతిపక్ష సభ్యుల నిరసన.. ప్రతీదానికి సంబంధించిన పూర్తి వివరాలు నా వద్ద ఉన్నాయి’ అని పేర్కొన్నారు. బీజేపీ వాళ్లు తనపై క్రిమినల్ కేసు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందని.. వారిని స్వాగతిస్తానని మొయిత్రా చెప్పారు. ‘నా వద్ద ఎన్ని జత ల చెప్పులు ఉన్నాయో అడిగేముందు.. రూ.1.30 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం గురించి అదానీని సీబీఐ, ఈడీ ప్రశ్నించాలి’ అని మరో పోస్ట్ పెట్టారు.
Updated Date - 2023-11-06T04:44:52+05:30 IST