ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adani: అంబులెన్స్ డ్రైవర్ అండర్సన్ దెబ్బకు అదానీ మటాష్

ABN, First Publish Date - 2023-02-02T16:11:07+05:30

భారతీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) ఓ కంపెనీ ఇచ్చిన నివేదికతో చలి జ్వరం వచ్చినట్లు వణుకుతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్‌లలో రూ. 10 లక్షల కోట్లను పోగొట్టుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Internet Desk: భారతీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) ఓ కంపెనీ ఇచ్చిన నివేదికతో చలి జ్వరం వచ్చినట్లు వణుకుతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్‌లలో (Trading Sessions) రూ. 10 లక్షల కోట్లను పోగొట్టుకున్నాయి. ప్రపంచ కుబేరులలో మూడో స్థానంలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఏడవ స్థానానికి పడిపోయారు. ఇక దేశంలో కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైన అదానీ (Adani) గ్రూప్ విలువ ఏకంగా రూ. నాలుగు లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది. ఇంతటి ఆర్థిక ప్రకంపనలకు కారణం.. న్యూయార్క్ (New York) కేంద్రంగా పనిచేసే హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ (Hindenburg Research Institute) ఇచ్చిన నివేదిక.

ఇది కూడా చదవండి..

అదానీ బాండ్స్‌.. విలువ సున్నా

న్యూయార్క్ కేంద్రంగా హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ పనిచేస్తోంది. 2017లో నాథ‌న్ ఆండ‌ర్స‌న్ (Nathan Anderson) దీనిని స్థాపించారు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని తమ వెబ్ సైట్‌ (Website)లో స్వయంగా వెల్లడించింది. పెట్టుబడులు, రుణాలు డెరిమేటీవ్‌లను ఇది విశ్లేషిస్తుంది. ఫైనాన్సియ‌ల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ (Financial Forensic Research) సేవ‌లు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తిస్తుంది.

ఈ కంపెనీని షార్ట్ షెల్లింగ్‌ (Short Shelling)లో కూడా పెట్టుబడులు పెడుతుంది. నాథ‌న్ ఆండ‌ర్స‌న్ గురించి పెద్దగా వివరాలు బయటకు తెలియవు.

అమెరికా (America)లోని కలెక్టికట్ విశ్వవిద్యాలయం (University of Connecticut)లో అంతర్జాతీయ వాణిజ్యంపై ఆండ‌ర్స‌న్ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఇజ్రాయేల్‌ (Israel)లోని జరూసలేం (Jurusalem)లో స్వచ్చంధంగా అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశారు. పరిస్థితులు చేజారిపోతున్న సమయంలో కూడా ధైర్యంగా ఎలా పనిచేయాలో అక్కడే నేర్చుకున్నట్లు ఆండ‌ర్స‌న్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన తిరిగి అమెరికా వచ్చాక ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశారు. తర్వాత వాషింగ్టన్‌లో ఓ బ్రోకర్ డీలర్ వద్ద పనిచేసినట్లు.. 2021లో ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. హిండెన్ ప్రారంభించడానికి ముందు హ్యారీ మార్కోపోలోస్‌తో కలిసి ప్లాటీనమ్ పాట్నర్స్ అని సంస్థపై దర్యాప్తు కోసం పనిచేశారు. హ్యారీ గతంలో బెన్నీ మాడాఫ్ అనే మోసపూరిత పథకం గుట్టు విప్పేందుకు పనిచేశారు.

హిండెన్ బ‌ర్గ్ ఏదైనా కంపెనీపై గురి పెడితే తొలుత ఆరు నెలలకుపైగా పబ్లిక్ రికార్డులు, అంతర్గత కార్పొరేట్ పత్రాలను పరిశీలించి కంపెనీ ఉద్యోగులతో మాట్లాడి సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత హిండెన్ బ‌ర్గ్‌తో కలిసి పనిచేసే భాగస్వాములకు వాటిని చేరవేస్తుంది. తర్వాత ఆ బృందం మొత్తం సదరు కంపెనీ షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకుంటాయి. ఆ కంపెనీ విలువ పతనమైన సమయంలో హిండెన్ బ‌ర్గ్‌కు ఆదాయం లభిస్తుంది.

Updated Date - 2023-02-02T17:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising