ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GCC: నగర శుభ్రతపై జీసీసీ దృష్టి

ABN, First Publish Date - 2023-02-11T08:00:43+05:30

నగరంలో బహిరంగ ప్రదేశాలు, ప్రధాన వీధుల్లో మూత్రవిసర్జన చేస్తే రూ.50ల చొప్పున జరిమానా విధించనున్నట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తే రూ.50 జరిమానా

- కార్పొరేషన్‌ కమిషనర్‌

చెన్నై, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నగరంలో బహిరంగ ప్రదేశాలు, ప్రధాన వీధుల్లో మూత్రవిసర్జన చేస్తే రూ.50ల చొప్పున జరిమానా విధించనున్నట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ(Gagandeep Singh Bedi) ప్రకటించారు. శుక్రవారం ఆయన నగరంలో విలేఖరులతో మాట్లాడుతూ.. పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు వీలుగా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకూడదనే ఆలోచనతో పలుచోట్ల మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా నిర్మిస్తున్నామన్నారు. అయినా ఎక్కువ జనసంచారం కలిగిన రహదారుల పక్కన, ప్రధాన వీధుల్లో మూత్ర విసర్జన చేస్తున్నారన్నారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన జరుగకుండా ఉండేందుకు స్పాట్‌ఫైన్‌గా రూ.50 వసూలు చేస్తామని కమిషనర్‌ హెచ్చరించారు. కార్పొరేషన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తరచూ తనిఖీలు చేస్తూ ఈ జరిమానా విధిస్తారని ఆయన వివరించారు.

Updated Date - 2023-02-11T08:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising