ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Patalkot Express: పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. దగ్ధమైన నాలుగు కోచ్‌లు.. కారణం ఏంటంటే?

ABN, First Publish Date - 2023-10-25T20:14:13+05:30

గత కొంతకాలం నుంచి రైలు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. పట్టాలు తప్పడమో, మంటలు చెలరేగడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624) రైలు...

గత కొంతకాలం నుంచి రైలు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. పట్టాలు తప్పడమో, మంటలు చెలరేగడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624) రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్‌లోని శివానికి వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆగ్రా నుంచి ఝాన్సీకి వెళ్తున్నప్పుడు.. ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని భదాయి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి.


రైలు బోగీలో మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి మరో బోగీలోకి పరుగులు తీశారు. మరోవైపు.. ఈ మంటలు వ్యాపించడంతో నాలుగు కోచ్‌లు దగ్ధం అయ్యాయి. ఈ అగ్నిప్రమాదం గురించి ప్రయాణికులు హెచ్చరించడంతో.. రైల్వే అధికారులు, స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇతర బోగీలకు మంటలు వ్యాపించడకుండా, వెంటనే మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తేల్చారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి.. రైలు, ప్రయాణికులకు మరింత నష్టం జరగకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకవైపు నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తుండగా.. మరోవైపు నుంచి మంటలకు ప్రభావితం అయిన బోగీల నుంచి ప్రయాణికుల్ని ఖాళీ చేయించారు. గాయాలైన వారికి అక్కడే ప్రాథమిక చికిత్స అందించినట్టు తెలిసింది. అయితే.. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా? లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కారణంగా.. ఆ మార్గాల్లో నడిచే ట్రైన్ల ప్రయాణానికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-25T20:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising