Eye diseases: నగరంలో పెరుగుతున్న కంటి జబ్బులు
ABN, First Publish Date - 2023-08-02T10:35:54+05:30
నగరంలో కంటి జబ్బులు(Eye diseases) పెరుగుతున్నాయని గత మూడేళ్లలో చెమ్మదనం లేని కళ్లనొప్పులు 50 శాతం వరకు పెరిగాయని, ఈ సమ
- డాక్టర్ రంజిత రాజగోపాలన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలో కంటి జబ్బులు(Eye diseases) పెరుగుతున్నాయని గత మూడేళ్లలో చెమ్మదనం లేని కళ్లనొప్పులు 50 శాతం వరకు పెరిగాయని, ఈ సమస్యలకు తగిన సమయంలో చికిత్సలు పొందకుంటే దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందని అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్యనిపుణురాలు రంజిత రాజగోపాలన్ హెచ్చరించారు. ప్రత్యేకించి బాలబాలికలు, యువకులు ఎక్కువగా డిజిటల్ స్ర్కీన్లను (మొబైల్‌ఫోన్లు) తిలకించడం, ఆన్‌లైన్ తరగతులను మొబైల్ ఫోన్లలో వీక్షించడం వల్ల కళ్లలో తడిని కోల్పోయి బాధపడుతున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. దీనికి తోడు పగటిపూట ఉష్ణోగ్రత పెరగడం వల్ల కంటి జబ్బులు అధికమవుతున్నాయని తెలిపారు.
Updated Date - 2023-08-02T10:35:54+05:30 IST