హఫీజ్ సయీద్‌ను అప్పగించం: పాక్
ABN, Publish Date - Dec 31 , 2023 | 03:52 AM
ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించే ఆలోచనేదీ తమకు లేదని పాకిస్థాన్ తెలిపింది.
ఇస్లామాబాద్, డిసెంబరు 30: ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించే ఆలోచనేదీ తమకు లేదని పాకిస్థాన్ తెలిపింది. భారత్‌తో తమకు అలాంటి ద్వైపాక్షిక ఒప్పందమేదీ లేదని స్పష్టం చేసింది. పలు ఉగ్రవాద దాడుల కేసుల్లో శిక్ష పడి.. పాక్ అధీనంలో ఉన్న హఫీజ్ సయీద్‌ను.. భారత్‌లో ఉగ్రవాద ఘటనలపై విచారించాల్సి ఉందని, అతణ్ని తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పాకిస్థాన్‌ను కోరింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా పాక్ ప్రభుత్వానికి పంపించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం తెలిపారు.
Updated Date - Dec 31 , 2023 | 03:52 AM