నాగ్‌పూర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:33 AM
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సోలార్ ఇండస్ట్రీస్
నాగ్‌పూర్, డిసెంబరు 17: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సోలార్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో కాస్ట్ బూస్టర్ యూనిట్‌లో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఫ్యాక్టరీ భద్రతా దళాల కోసం డ్రోన్లు, పేలుడు పదార్థాలు తయారు చేస్తోంది. ఫ్యాక్టరీలో తయారైన ఉత్పత్తులు సీలింగ్ చేస్తుండగా పేలుడు సంభవించిందని, అప్పుడు 12మంది కార్మికులు ఫ్యాక్టరీలోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం ఏక్‌నాథ్ షిండే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Updated Date - Dec 18 , 2023 | 03:33 AM