Earthquake: తమిళనాడులో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు..
ABN, First Publish Date - 2023-12-08T14:01:37+05:30
చెన్నై: తమిళనాడులో భూమి కంపించింది. భూకంపం వణికించడంతో చెంగల్‌పట్టు జిల్లా వాసులు రోడ్డుపైకి పరుగులు తీశారు. భూమి తిరిగినట్లు, ఇంట్లో వస్తువులు కదిలినట్లు అనిపించడంతో చాలా మంది అయోమయానికి గురయ్యారు.
చెన్నై: తమిళనాడు (Tamilnadu)లో భూమి కంపించింది. భూకంపం (Earthquake) వణికించడంతో చెంగల్‌పట్టు జిల్లా వాసులు రోడ్డుపైకి పరుగులు తీశారు. భూమి తిరిగినట్లు, ఇంట్లో వస్తువులు కదిలినట్లు అనిపించడంతో చాలా మంది అయోమయానికి గురయ్యారు. చెంగల్‌పట్టు జిల్లాలో శుక్రవారం ఉదయం 7 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని సంబంధిత అధికారులు గుర్తించారు. తమిళనాడులో చెంగల్‌పట్టు, తిరుపత్తూరు, వాణియంపాడి, అంబూరు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు భయాందోళన చెందారు.
Updated Date - 2023-12-08T14:01:39+05:30 IST