Dussehra celebrations: 15 నుంచి దసరా ఉత్సవాలు
ABN, First Publish Date - 2023-10-06T11:57:54+05:30
ఈ నెల 15వ తేది నుంచి చెంగల్పట్టు దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ప్రారంభం కానున్నాయి. ఈ జిల్లాలో వందేళ్లకు
ఐసిఎఫ్(చెన్నై): ఈ నెల 15వ తేది నుంచి చెంగల్పట్టు దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ప్రారంభం కానున్నాయి. ఈ జిల్లాలో వందేళ్లకు పైగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో వేలాది మంది పాల్గొంటారు. పాత జీఎన్టీ రోడ్డు ఇరువైపులా దసరా పండుగను పురస్కరించుకొని ఇతర ప్రాం తాల నుంచి రాట్నాలను తీసుకొచ్చి ఏర్పాటుచేస్తున్నారు. మైసూరుకు ధీటుగా ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు విశేషమైనవిగా పేర్కొంటున్నారు. ప్రతిరోజు 30 వేల మందికి పైగా పాల్గొననుండడంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగే ఉత్సవాలను పురస్కరించుకొని వంద ప్రాంతా ల్లో సీసీ కెమెరాలు అమర్చి 150 మంది పోలీసులు నిఘా పనులకు నియమించనున్నట్లు అధికారులు తెలిపారు.
Updated Date - 2023-10-06T11:57:54+05:30 IST