Delhi: దట్టమైన పొగమంచు.. విమాన, రైలు ప్రయాణాలపై ప్రభావం..
ABN, Publish Date - Dec 28 , 2023 | 09:41 AM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా ఉత్తరాదిన దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా ఉత్తరాదిన దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. దీంతో వాతావరణ శాఖ వాహనదారులకు హెచ్చరికలు జారీచేసింది. ఫాగ్ లైట్లు ఉపయోగించాలని సూచించింది. పొగమంచు ప్రభావం విమాన, రైలు ప్రయాణాలపైనా పడింది. 134 విమాన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ చేరుకోవాల్సిన పలు విమానాలు దారిమళ్లించారు. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడి ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తెలంగాణ ఎక్స్ ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది.
Updated Date - Dec 28 , 2023 | 09:41 AM