ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

INDIA Alliance: ఈ నెల 6న ఇండియా కూటమి సమావేశం

ABN, First Publish Date - 2023-12-03T12:45:00+05:30

ఈ నెల 6న ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.. డీఎం‌కే, త‌ృణమూల్ కాంగ్రెస్‌లకు సమావేశంలో పాల్గొనాలని కోరారు.

ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 6న ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.. డీఎం‌కే, త‌ృణమూల్ కాంగ్రెస్‌లను సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక జరగబోతున్న ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీ, దాని మిత్రపక్షాలను ఎదుర్కొనేందుకు కాంగ్రస్, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మునపటి మీటింగ్‌కు శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే సారథ్యం వహించారు. నాటి సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటూ పలువురు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.


ఇదిలా ఉంటే.. నేడు విడుదలైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. తాజాగా లెక్కల ప్రకారం, 230 అసెంబ్లీ సీట్లున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ 161 సీట్లలో ఆధిపత్యంలో ఉండగా కాంగ్రెస్ 68 స్థానాల్లో ముందంజలో ఉంది. రాజస్థాన్‌లో 199 సీట్లకు గాను 113 సీట్లలో బీజేపీ లీడ్‌లో ఉండగా కాంగ్రెస్ 71 సీట్లలో ఆధిపత్యంలో ఉంది. ఇక 46 మేజిక్ ఫిగర్‌గా ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో బీజేపీ 54 స్థానాల్లో, కాంగ్రెస్ 34 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక బీజేపీ 10 స్థానాల్లో తన ఆధిపత్యం కొనసాగిస్తోంది.

Updated Date - 2023-12-03T12:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising