ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress : దేశం కోసం దానం

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:46 AM

దేశవ్యాప్తంగా క్రౌడ్‌ ఫండింగ్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టింది. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి గత కొన్నేళ్లుగా విరాళాలు రావడం భారీగా తగ్గింది. 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఈ ప్రచార, నిధుల సమీకరణ

విరాళాల సేకరణకు కాంగ్రెస్‌ నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా క్రౌడ్‌ ఫండింగ్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టింది. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి గత కొన్నేళ్లుగా విరాళాలు రావడం భారీగా తగ్గింది. 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఈ ప్రచార, నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. శనివార ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌) కేసీ వేణుగోపాల్‌, కోశాధికారి అజయ్‌ మాకన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మహాత్మా గాంధీ 1920-21లో పిలుపునిచ్చిన చరిత్రాత్మక ‘తిలక్‌ స్వరాజ్‌ ఫండ్‌’ ప్రచారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘డొనేట్‌ ఫర్‌ దేశ్‌’ కార్యక్రమాన్ని రూపొందించాం. కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 138 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో రూ.138, రూ.1,380, రూ.13,800... చొప్పున విరాళాలు సేకరించాలని నిర్ణయించాం. డిసెంబరు 18న పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే సమయంలో ఆన్‌లైన్‌ పేమెంట్‌ లింక్‌లు నిర్దేశిత వెబ్‌ సైట్స్‌లో అందుబాటులో ఉంటాయి.పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబరు 28 వరకూ ఈ ప్రచార, నిధుల సమీకరణ కార్యక్రమం నడుస్తుంది. ఆ తరువాత వలంటీర్లు ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని కనీసం 10 ఇళ్ల నుంచి రూ.138 చొప్పున వారు విరాళాలు సేకరిస్తారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు కనీసం రూ.1,380 చొప్పున విరాళం ఇవ్వాలని సూచిస్తున్నాం. ఇది దేశంలోనే అతి పెద్ద క్రౌడ్‌ పుల్లింగ్‌ ఫండ్‌ క్యాంపెయిన్‌ అవుతుంది. పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబరు 28న నాగ్‌పూర్‌లో 10 లక్షల మందితో భారీ ర్యాలీని నిర్వహిస్తాం’’ అని వేణుగోపాల్‌, అజయ్‌ వివరించారు.

Updated Date - Dec 17 , 2023 | 05:46 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising