Chennai Railway Station: ‘యువర్ అటెన్షన్ ప్లీజ్’.. ఇక చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో వినిపించదు !
ABN, First Publish Date - 2023-02-28T11:46:26+05:30
‘యువర్ అటెన్షన్ ప్లీజ్....’ అంటూ బిగ్గరగా వినబడే మాటలు ఇకపై చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో వినిపించవు. దేశంలోనే ప్రధాన రైల్వే
పెరంబూర్(చెన్నై): ‘యువర్ అటెన్షన్ ప్లీజ్....’ అంటూ బిగ్గరగా వినబడే మాటలు ఇకపై చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో వినిపించవు. దేశంలోనే ప్రధాన రైల్వే స్టేషన్లలో డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్(Chennai Central Railway Station) ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ప్రతిరోజు వందల సంఖ్యలో నడుపుతున్న రైళ్లలో లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ రైల్వేస్టేషన్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఇక, రైళ్ల రాకపోకల వివరాలు ఆడియో ద్వారా లౌడ్ స్పీకర్‌లలో వినిపిస్తుంటారు. ఒక్కో ప్లాట్‌ఫాంలో సుమారు 5 ప్రాంతాల చొప్పున రైల్వేస్టేషన్(Railway station) మొత్తం 50కి పైగా లౌడ్ స్పీకర్లు ఏర్పాటయ్యాయి. రైలు వచ్చే సమయంలో అరగంట, వెళ్లే సమయంలో గంట పాటు ఆ రైలు వివరాలు తెలుపుతుంటారు. దీంతో, ప్రయాణికులు, భద్రతలో ఉన్న పోలీసులకు ఇబ్బందిగా ఉంటోంది. అదే సమయంలో దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో స్వచ్ఛభారత్ పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచుతున్న రైల్వే శాఖ, తాజాగా సౌండ్ రహిత రైల్వేస్టేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ విషయమై రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సౌండ్ రహితంగా చెన్నై రైల్వేస్టేషన్ రూపుదిద్దుకోనుందన్నారు. అదే సమయంలో రైళ్ల రాకపోకల వివరాలు ప్రయాణికులు తెలుసుకొనేలా అధిక ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుతో పాటు, సమాచారం అందించే కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - 2023-02-28T19:38:36+05:30 IST