ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: ఒకటికాదు.. రెండుకాదు.. రూ.వెయ్యి కోట్ల భూమి స్వాధీనం

ABN, First Publish Date - 2023-06-07T13:36:01+05:30

సుప్రీంకోర్టు తీర్పుతో చెన్నై(Chennai) నడిబొడ్డున జెమిని వంతెనకు సమీపంలోని సెమ్మొళిపార్కు వద్ద రూ.వెయ్యి కోట్ల భూమిని ప్రభుత్వం స్వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): సుప్రీంకోర్టు తీర్పుతో చెన్నై(Chennai) నడిబొడ్డున జెమిని వంతెనకు సమీపంలోని సెమ్మొళిపార్కు వద్ద రూ.వెయ్యి కోట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ స్థలం ఇప్పటివరకు అన్నాడీఎంకేకు చెందిన ప్రముఖ నేత ఆధీనంలో ఉండేది. జెమిని వంతెనకు సమీపంలో కెథడ్రల్‌ సాలై అనుకుని ప్రభుత్వానికి సొంతమైన స్థలాన్ని అన్నాడీఎంకే(AIADMK) ప్రముఖుడు వి.కృష్ణమూర్తి హార్టికల్చర్‌ సంఘం అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, తన ఆఽధీనంలోకి తీసుకున్నారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం 1989లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఈ స్థలంలో 20 యేళ్ళ లీజుకు ప్రాతిపదిక డ్రైవ్‌ ఇన్‌ హోటల్‌ ఉండేది. ఇది మొత్తం 20 ఎకరాల స్థలంలో ఉండగా, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెమ్మొళి పార్కును అభివృద్ధి చేసింది. ఈ పార్కుకు ఎదురుగా ఉన్న సుమారు వెయ్యి కోట్ల రూపాయల స్థలాన్ని మాత్రం కృష్ణమూర్తి ఆధీనంలోనే ఉంచుకుని, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ఈ స్థలాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ చర్యను నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-06-07T13:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising