ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: మమ్మల్ని మాతృభాషలో చదువుకోనివ్వండి

ABN, First Publish Date - 2023-10-03T10:19:20+05:30

రాష్ట్రంలో మైనార్టీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకొనేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) జారీ చేసిన

- ‘లిమ్‌ఫోర్ట్‌’ చైర్మన్‌ ఆచార్య సీఎంకే రెడ్డి డిమాండ్‌

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో మైనార్టీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకొనేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) జారీ చేసిన తీర్పును రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని ‘లింగ్విస్టిక్‌ మైనార్టీస్‌ ఫోరం ఆఫ్‌ తమిళనాడు’ (లిమ్‌ఫోర్ట్‌) చైర్మన్‌ ఆచార్య సీఎంకే రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో స్థిరపడిన తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ వంటి మైనార్టీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకోవచ్చని సుప్రీంకోర్టు గత నెల 21వ తేది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చెన్నై ప్రెస్‌క్లబ్‌(Chennai Press Club)లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిమ్‌ఫోర్ట్‌ చైర్మన్‌ సీఎంకే రెడ్డి, వైస్‌ చైర్మన్లు నందగోవింద్‌ (మలయాళం), పి.నారాయణ భట్‌ (కన్నడ), ప్రముఖ న్యాయవాది సత్యరాజ్‌, హెగ్డే, ఏఐటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి నాయకర్‌ నందగోపాల్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. ముందుగా సీఎంకే రెడ్డి మాట్లాడుతూ... సుప్రీంకోర్టు లిమ్‌ఫోర్ట్‌కు మద్దతుగా ఇటీవల వెలువరించిన తీర్పును రాష్ట్రప్రభుత్వం త్రికరణశుద్ధిగా అమలు చేయాలని, తద్వారా మైనార్టీ భాషలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 13 మైనార్టీ భాషలు మాట్లాడే ప్రజలు ఓటు హక్కు కలిగి ఉన్నారని, వీరిలో తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళ భాషలు మాట్లాడేవారు అధికమన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం వారివారి మాతృభాషలో చదువుకోనివ్వాలని, తాము తమిళ భాషలో ఒక సబ్జెక్ట్‌ చదువుకొనేందుకు కూడా సిద్ధమేనన్నారు. పాలకులు భాషను, సంస్కృతిని, ఆచారాన్ని కాపాడడమే క్షేత్ర ధర్మమని, వీటికి హాని చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని సీఎంకే రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్‌ నాయకులు కేవీ జనార్దనం, భుజంగరావు, జి.మురళి, కుంకు దశరఽథరావు, బీఎన్‌ బాలాజి, డాక్టర్‌ ఎన్‌.నాగభూషణం పాల్గొన్నారు.

Updated Date - 2023-10-03T10:23:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising