Bribe Case: రూ.50 లక్షల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్టు
ABN, First Publish Date - 2023-01-15T15:48:11+05:30
కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి అవినీతి అధికారులపై కొరడా ఝళిపించింది. రూ.50 లక్షలు లంచంగా తీసుకున్న భారత రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ ...
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మరోసారి అవినీతి అధికారులపై కొరడా ఝళిపించింది. రూ.50 లక్షలు లంచంగా తీసుకున్న భారత రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి జితేంద్ర పాల్ సింగ్‌ను, అతని సహచరుడు హరి ఓం గిరిని ఆదివారంనాడు అరెస్టు చేసింది. జితేంద్ర పాల్ సింగ్ 1997 బ్యాచ్ ఆఫీసర్. గౌహతిలో ఆయన పనిచేస్తున్నారు. లంచం సొమ్మును హవాలా ద్వారా హరి ఓం గిరి అందుకున్నట్టు దర్యాప్తు సంస్థ గుర్తించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి మరికొందరిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, తాజా అరెస్టులకు సంబంధించి సీబీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Updated Date - 2023-01-15T15:48:49+05:30 IST