Bus depots: ఆర్టీసీ ప్రైవేటీకరణ స్టార్ట్.. మొత్తం ఎన్ని డిపోలు అంటే...
ABN, First Publish Date - 2023-03-17T10:57:15+05:30
నగరంలో ప్రైవేటు సిటీ బస్సుల(Private city buses)ను నడిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎంటీసీ డిపోల్లో మూడింటిని ప్రైవేటుపరం చేయనుంది.
అడయార్(చెన్నై): నగరంలో ప్రైవేటు సిటీ బస్సుల(Private city buses)ను నడిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎంటీసీ డిపోల్లో మూడింటిని ప్రైవేటుపరం చేయనుంది. వ్యాసార్‌పాడి, తిరువాన్మియూరు, వడపళని డిపోలను ప్రైవేటీకరణ(Privatization) చేయాలని ఎంటీసీ అధికారులు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ డిపోలు బస్సుల పర్యవేక్షణ కోసం 30 యేళ్ళపాటు చూసుకునేలా రూ.1540 కోట్లకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఈ మూడు డిపోల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన డిపోలను కూడా దశల వారీగా ప్రైవేటీకరించాలన్న ఆలోచనలో రవాణా శాఖ అధికారులు ఉన్నారు. అయితే, నగరంలో ప్రైవేటు బస్సులను నడపటం, డిపోలను ప్రైవేటీకరణ చేయడం వంటి చర్యలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Updated Date - 2023-03-17T10:57:15+05:30 IST