ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Pratap Simha : దేశద్రోహినా.. దేశభక్తుడినా..? ప్రజలే నిర్ణయిస్తారు: ప్రతాప్‌ సింహా

ABN, Publish Date - Dec 25 , 2023 | 01:25 AM

‘నేను దేశ ద్రోహినా.. దేశభక్తుడినా.. అనేది ప్రజలే నిర్ణయిస్తారు. నాపై కొందరు ‘ద్రోహి’ అనే ముద్ర వేశారు. దీనిని కూడా ఆ దేవుడికి, ప్రజలకు, నన్ను అభిమానించే పాఠకులకు వదిలి పెడుతున్నా’’ అని బీజేపీ మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సింహా సంచలన

బెంగళూరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘నేను దేశ ద్రోహినా.. దేశభక్తుడినా.. అనేది ప్రజలే నిర్ణయిస్తారు. నాపై కొందరు ‘ద్రోహి’ అనే ముద్ర వేశారు. దీనిని కూడా ఆ దేవుడికి, ప్రజలకు, నన్ను అభిమానించే పాఠకులకు వదిలి పెడుతున్నా’’ అని బీజేపీ మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సింహా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లోక్‌సభలో జరిగిన పొగబాంబు ఘటనపై ఆయన స్పందించారు. ఎంపీ సింహా కార్యాలయం ఇచ్చిన పాసులతోనే దుండగులు లోక్‌సభలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రతాప్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను దేశద్రోహినా, దేశభక్తుడినా అనే విషయాన్ని 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఘటనకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోందని, ఇంతకుమించి తానేమీ దీనిపై మాట్లాడబోనని అన్నారు. పార్లమెంటు ఘటనకు సంబంధించి తనను ఎలాంటి ప్రశ్నలు అడగవద్దని మీడియాను కోరారు.

Updated Date - Dec 25 , 2023 | 01:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising