ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2023-06-02T21:47:44+05:30

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారుల బదిలీ విషయంలో మార్గదర్శకాలు సూచిస్తూ ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు లేఖలు రాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్న తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు కేంద్రం ఎన్నికల సంఘం(Central Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారుల బదిలీ(Transfers) విషయంలో మార్గదర్శకాలు సూచిస్తూ ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు(CEO) లేఖలు రాసింది.

మరో ఆరు నెలల్లో తెలంగాణ(Telangana) రాజస్థాన్(Rajasthan), మధ్యప్రదేశ్(Madhyapradesh), మిజోరాం(Mizoram), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారులను వారి సొంత జిల్లాల్లో విధులు నిర్వహించకూడదని, అంతేకాకుండా మూడేళ్లపాటు ఒకేచోట ఉద్యోగం చేస్తున్న అధికారులను సైతం కొనసాగించవద్దని పేర్కొంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు తెలుపుతూ రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు(CEO) లేఖలు రాసింది.

ఎన్నికల డ్యూటీలో పాల్గొనే అధికారులు క్రిమినల్ కేసులు(Criminal Cases) లేవని డిక్లరేషన్ తీసుకోవాలని తెలిపింది. అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, బదిలీలు, పోస్టింగ్‌లపై జూలై 31లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం(CEC) లేఖలో పేర్కొంది.

Updated Date - 2023-06-02T21:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising