ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anurag Thakur: ఆయన కోరికని సోమవారం తీరుస్తాం.. అశోక్ గెహ్లాట్‌కి ఠాకూర్ కౌంటర్

ABN, First Publish Date - 2023-12-09T21:50:57+05:30

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల్ని ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పారు.

Anurag Thakur To Ashok Gehlot: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల్ని ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పారు. ‘‘మేము సోమవారం అశోక్ గెహ్లోట్ కోరికని నెరవేరుస్తాం. రాజస్థాన్ తన ఐదేళ్ల పాలనలో అవినీతి, బంధుప్రీతి, అంతర్గత ఘర్షణలను చూసింది. ఆయన ఇప్పుడు శాంతియుతంగా కూర్చోవాలి’’ అంటూ గెహ్లాట్‌కు ఠాకూర్ చురకలంటించారు. తమ పార్టీ అధిష్టానం నుండి ఆదేశాలు ఇవ్వదని.. ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చొని, ఒక నాయకుడిని నిర్ణయించే బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.


అంతకుముందు.. మూడు రాష్ట్రాలకు సీఎంలను ప్రకటించడంలో బీజేపీ ఆలస్యం చేయడంపై ఆ పార్టీకి క్రమశిక్షణ లేదని అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ఇదే పని తాము చేసి ఉంటే.. బీజేపీ వాళ్లు ఎన్నో విమర్శలు చేసేవారని అన్నారు. ‘‘భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ అనేదే లేదు. ఇంతవరకూ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని వాళ్లు ప్రకటించలేదు. ఇదే పని కాంగ్రెస్ చేసి ఉంటో.. మాపై ఎలాంటి ఆరోపణలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించేవారో నాకు తెలీదు. వాళ్లు ఎన్నికల్ని పోలరైజ్ చేశారు. రాజస్థాన్‌లో రాబోయే కొత్త ప్రభుత్వానికి మేము పూర్తిగా సహకారం అందిస్తాము’’ అని అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇందుకు కౌంటర్‌గానే అనురాగ్ ఠాకూర్ పైవిధంగా స్పందించారు. సోమవారానికి ముఖ్యమంత్రుల్ని ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఇదిలావుండగా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో దాదాపు 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 163 స్థానాల్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 63 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక రాజస్థాన్‌లో బీజేపీకి 115 సీట్లు, కాంగ్రెస్‌కు 69.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 54, కాంగ్రెస్‌కు 35 సీట్లు వచ్చాయి. నిజానికి.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీనే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కానీ.. అందుకు భిన్నంగా బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేసింది.

Updated Date - 2023-12-09T21:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising