ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Almaty: నిండిన ఆల్మట్టి జలాశయం

ABN, First Publish Date - 2023-08-08T10:58:33+05:30

కృష్ణానదికి అనుబంధంగా విజయపుర జిల్లా నిడగుంది తాలూకా పరిధిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి (ఆల్మట్టి) జలాశయం

- 6 ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి అనుబంధంగా విజయపుర జిల్లా నిడగుంది తాలూకా పరిధిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి (ఆల్మట్టి) జలాశయం దాదాపు నిండింది. సోమవారం రాత్రికి లేదా మంగళవారం ఉదయానికి భర్తీ కానున్నటు కృష్ణా జలమండలి అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 519.60 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 519.52 అడుగులకు చే రింది. ఇన్‌ఫ్లో 66,750 క్యూసెక్కులుగా ఉంది. మహారాష్ట్ర పశ్చిమ(Western Maharashtra) భాగంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ఆల్మట్టికి వరద పోటెత్తుతుండటంతో జూలై 21 నుంచి ఆరు విద్యుత్‌ ఉత్పత్తి విభాగాలకు అనువుగా రోజు 42వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూలై 21 నుంచి ఆగస్టు 7 వరకూ 80 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. విద్యుత్‌ను పవర్‌ గ్రిడ్‌ ద్వారా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఆల్మట్టి నిండిన మేరకు నదికి నీరు భారీగా వదులుతున్నందున కిందిభాగాన ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌(Telangana, Andhra Pradesh) రాష్ట్రాల ప్రాజెక్టులకు జలకళ సాధ్యం కానుందనే సంతోషం వ్యక్తమవుతోంది. కర్ణాటక పరిధిలో ప్రాజెక్టులు నిండిన వెంటనే ముఖ్యమంత్రి(Chief Minister) వాయనం సమర్పించే సం ప్రదాయం ఉంది. కానీ శ్రావణ మాసం ఆరంభమయ్యాక 18 తర్వాత సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-08-08T10:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising