ఒకేసారి 4 లక్ష్యాలను ఛేదించిన ఆకాశ్
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:37 AM
భారత్ రూపొందించిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ 25 కిలోమీటర్ల పరిధిలో ఒకేసారి నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని డీఆర్‌డీవో ఆదివారం
న్యూఢిల్లీ, డిసెంబరు 17: భారత్ రూపొందించిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ 25 కిలోమీటర్ల పరిధిలో ఒకేసారి నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని డీఆర్‌డీవో ఆదివారం తెలిపింది. ఈ క్రమంలో ‘‘సింగిల్ ఫైరింగ్ యూనిట్‌ను ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా 25 కి.మీ. పరిధిలో ఏకకాలంలో నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలిదేశంగా భారత్ నిలిచింది. ఆకాశ్ ఆయుధ వ్యవస్థను ఉపయోగించి భారత వైమానిక దళం ఈ పరీక్షను నిర్వహించింది’ అని డీఆర్‌డీవో ‘ఎక్స్’ (ట్విటర్)లో ట్వీట్ చేసింది. దేశీయంగా తయారైన ఈ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని ఈ నెల 12న జరిగిన ‘అష్టశక్తి’ సైనిక విన్యాసాల సందర్భంగా ప్రదర్శించినట్టు పేర్కొంది.
Updated Date - Dec 18 , 2023 | 03:37 AM